Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్పుట్ట మధు వ్యాఖ్యలు అవాస్తవం...

పుట్ట మధు వ్యాఖ్యలు అవాస్తవం…

- Advertisement -
  • – మండల మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు కొండ రాజమ్మ 
  • నవతెలంగాణ – మల్హర్ రావు 
    మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజ రామయ్యర్ దంపతులపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మండల మాజీ జెడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ తెలిపారు. సోమవారం కొయ్యుర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయంలో ఉద్దేశపూర్వకంగా జరిగినది. కాదని,లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కర ఉత్సవాల్లో టెండర్ తీసుకున్న సంస్థలు ఫ్లెక్సీలలో ఫోటోలు ఏర్పాటు చేయకపోతే మంత్రి శ్రీధర్ బాబును,ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.భారత రాజ్యాంగం వర్ధిల్లాలని మాట్లాడే పుట్ట టిఆర్ఎస్ పాలనలో దళిత జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని ప్రోటోకాల్ విషయంలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.అడుగడుగునా అవమానాలకు గురిచేస్తూ నాడు ఐదు మండలాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి నీ పేరు పెట్టించుకున్నది నిజం కాదని నిలదీశారు.భూపాలపల్లి నియోజకవర్గ ఆరు మండలాలలో కనీసం ప్రోటోకాల్, ఫోటో, క్యాంప్ ఆఫీస్ లేకుండా చేసిన మీ నాయకులను ఎందుకు ప్రశ్నించలేన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు మంత్రి రాజసమ్మయ్య,మండల ప్రధాన కార్యదర్శి రవి,శ్రీనివాస్, వెంకన్న, నరేష్ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -