నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో రెండవ విడత 14వ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో దొంగ ఓట్లు కౌంటింగ్ విషయంలో అధికారుల లోపంపై కలెక్టర్ కు సర్పంచ్ అభ్యర్థి శ్రీలత, గ్రామస్తులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట వారు మాట్లాడుతూ తాము పలుమార్లు అధికారులకు దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు ఇచ్చామన్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదని ఈసీకి కూడా ఫిర్యాదు ఇచ్చామని, దొంగ ఓటర్లను తొలగించలేదని ఇలా తొలగించకపోవడం వల్ల ఎంతో మంది తనకు చట్టబద్ధమైన ఓటు వేసిన వారు కూడా అభాసు పాలవుతున్నారని పేర్కొన్నారు.
ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటే అధికారులు సైతం తప్పు చేసేవారికి సహకరించినట్లుగా ఉందని మా సొంత గ్రామం వారివి అవతలివారికి ఈ ఓట్లు పడవు అనుకున్న వారిని తొలగిస్తూ వారికి కావాల్సినవార్లను సొంత గ్రామం కాకపోయినా చేర్చుతూ ఓటర్ లిస్ట్ లో పేర్లను చేర్చుతూ బిఎల్ఓ సునంద దొంగ ఓట్లు వేయించేవారికి సహకరిస్తుందని దొంగ ఓట్ల అని చెప్పినా, అధికారులు ఓటర్ లిస్ట్ లో పేరు ఉంది కనుక వేయిస్తున్నామని అధికారులు చెప్పారని తెలిపారు.
కౌంటింగ్ సమయంలో తమకు అనుమానం ఉందనిఅధికారులను రీకౌంటింగ్ చేయాలని అడుగుతే అధికారులు సహకరించడం లేదన్నారు. పైగా మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని, రీకౌంటింగ్ దొంగ ఓట్లను మైనస్ చేయుటంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. తనను నమ్మి ఓట్లు వేసిన వారికి న్యాయం జరిగే వరకూ హైకోర్టుకు వెల్లైనా సరే న్యాయం జరిగే వరకూ పోరాడుతానని చెప్పారు.



