నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. పలువురు అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి పంచాయతీలో సర్పంచి అభ్యర్థి అసంపల్లి రాజయ్య తరపున ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆకట్టుకునే హామీలు ఇచ్చారు. రాజయ్య గెలిస్తే, పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ.10,116, ప్రసూతి ఖర్చులకు రూ.5,116, వస్త్రాలంకరణకు రూ.5,116, అత్యవసర వైద్యానికి రూ.5-10 వేలు, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,116 చొప్పున తాము అందిస్తామని గుడి భాస్కర్‌రెడ్డి, గుడి దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రకటించారు. అభ్యర్థి స్నేహితులు ఇలా ముందుకు రావడం ఆకట్టుకుంటోంది.



