నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడికి ఐపీఎల్ జట్టులో చోటు లభించింది. 21 ఏళ్ల పేరాల అమన్‌రావును మంగళవారం నిర్వహించిన వేలంలో రూ.30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ జట్టు తరఫున అండర్-23 విభాగంలో రంజీ క్రికెట్ టోర్నీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్‌లో 160 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అమన్‌రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొన్నేళ్ల కిందట జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. అమన్‌రావు తాత పేరాల గోపాల్‌రావు జిల్లా పరిషత్ గత పాలకవర్గంలో వైస్ ఛైర్మన్‌గా సేవలందించారు. వీరి స్వగ్రామం జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి. కొన్నేళ్ల కిందటి నుంచి అమన్‌రావు కుటుంబం హైదరాబాద్‌లో నివాసముంటోంది. యువ క్రీడాకారుడు ఐపీఎల్‌కు ఎంపికవడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్ సునీల్‌రావులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ఐపీఎల్‌లో తెలంగాణ కుర్రోడు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



