ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మల్లికార్జున్ రెడ్డి, విషువర్ధన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కలివి వనం’. రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, శ్రీ చరణ్, అశోక్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తుం డగా, హీరోయిన్‌గా నాగదుర్గ ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు. యూట్యూబ్ మీడియా మిత్రులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో కొండగట్టు బందావన్ రిసార్ట్‌లో ఈ చిత్ర పోస్టర్ లాంచ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. మై విలేజ్ షో శ్రీకాంత్, చందు, ధూమ్ ధాం ఛానల్ రాజు, యూట్యూబ్ స్టార్ టోనీ క్విక్, అక్షిత్ మార్వెల్, వెంకట్ జోడు, బబ్లూ, శివ వేల్పుల, అంతడుపుల నాగరాజు, రేంజరాళ్ల రాజేష్, బాలు కాయత్, డైరెక్టర్ హరి చరణ్, యమున తారక్, సింగర్ శిరీష, నాగలక్ష్మి, హరీష్ పటేల్, సౌజన్య, గుగ్గిళ్ళ శివప్రసాద్, మౌనిక డింపుల్, కమల్ ఎస్లావత్ తదితరులు పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
‘ఈ చిత్రం వనాలను సంరక్షించుకునే కాన్సెప్ట్‌తో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గుట్రాజుపల్లి ప్రాంతంలోని సారంగాపూర్ అడవులలో ఈ సినిమాని చిత్రీకరించాం. తెలంగాణ విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చిన ‘బలగం, పొట్టేల్’ వంటి చిత్రాల మాదిరిగానే మా చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌తోపాటు పాటలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది’ అని మేకర్స్ తెలిపారు. ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ :జీఎల్‌బాబు, సంగీతం : మదీన్‌ఎస్కే, పాటలు : కాసర్ల శ్యామ్, మాట్ల తిరుపతి, కమల్ ఇస్లవంత్.
వనాల సంరక్షణ కాన్సెప్ట్‌తో ‘కలివి వనం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES