- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 ఎగబాకి రూ.1,23,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000కు చేరింది. వెండి ధర రెండ్రోజుల్లోనే రూ.13వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
- Advertisement -



