– సింగపూర్, హాంకాంగ్‌లలో భారీగా కేసులు
– భారత్‌లో 257
న్యూఢిల్లీ: కొన్ని ఏండ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్లీ తన కోరలు చాచుతోంది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌ల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లో సోమవారం నాటికి 257 క్రియాశీల కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులన్నీ స్వల్ప తీవ్రతతో కలిగి ఉన్నవని, ఆస్పత్రుల్లో చేరాల్సి అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇతర దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పూర్తి అప్రమత్తతో ఉన్నామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ), ఐసిఎంఆర్ ద్వారా కోవిడ్‌తో సహా శ్వాసకోశ వైరల్ వాధ్యుల నిఘా కోసం బలమైన నిఘా వ్యవస్థ దేశంలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (ఈఎంఆర్), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం తరువాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
మళ్లీ వస్తున్న కరోనా
- Advertisement -
- Advertisement -