నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఆస్ట్రేలియా బోండి బీచ్‌లో తండ్రీ, కొడుకులు కలిసి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11మంది చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విచారణలో భాగంగా కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ గురించి విస్తూపోయే విషయాలు బయటికి వచ్చాయి.
ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా కోసం 27 సార్లు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇప్పటికీ ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసాను పొందలేకపోయాడు. 27 సార్ల తర్వాత రెసిడెంట్ రిటన్ వీసాను పొందాడు. 27 సంవత్సరాలుగా 1998 నవంబర్ 8న స్టూడెంట్ విసాపై ఆస్ట్రేలియాకి వెళ్లాడు. 2000 సంవత్సరంలో వెన్నసా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో నవీద్ అనే బాలుడు జన్మించాడు.
ఈక్రమంలోనే నిందితునికి హైదరాబాద్ ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాది సాజిద్ 1998లో నాంపల్లిలోని అన్వర్ ఉల్ కాలేజీలో బీఏ పూర్తి చేశాడని పోలీసుల విచారణలో తేలింది. 2018లో వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని హైదరాబాద్ వచ్చి అమ్మేశాడు. హైదరాబాదులో అమ్మగా వచ్చిన డబ్బులతో ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుగోలు చేశాడు. 2012లో చివరిసారిగా హైదరాబాద్ వచ్చి వెళ్లాడు ఉగ్రవాది. 2012 నుంచి ఇప్పటివరకు తన పాస్పోర్ట్ ని రెన్యువల్ చేయించుకోలేదు.



