Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంపార్లమెంటు నిరవధికంగా వాయిదా

పార్లమెంటు నిరవధికంగా వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ నిరవధికంగా ఉభయ సభలను వాయిదా వేస్తూ ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి ఈరోజుతో (డిసెంబర్ 19) ముగిశాయి. సెషన్ చివరి రోజు లోక్‌సభలో వందే‌మాతరం ఆలపన అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభ కూడా అదే‌విధంగా ముగిసింది.

అయితే విపక్షాల తీవ్ర నిరసనల నడుమ కీలక బిల్లులు ఆమోదం పొందాయి. విపక్షాలు ముఖ్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లు (VB-G RAM G)పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లు MGNREGAను భర్తీ చేస్తూ గ్రామీణ ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు కొన్ని కీలక మార్పులు జరిగాయి.

అదేవిధంగా అణు ఇంధన రంగాన్ని ప్రైవేట్ రంగానికి విస్తరించడం, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించేలా సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా బిల్లును ఆమోదం పొందింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)ను 74 శాతం నుంచి 100 శాతనాకి పెంచే కు పెంచే సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా-2025 బిల్లును కూడా ఉభయ సభలు ఆమోదించాయి. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు విపక్షాల నిరసనలు, గందరగోళం మధ్య ముగిశాయి. మరోవైపు ఢిల్లీ వాయు కాలుష్యం వంటి ముఖ్య అంశాలపై సభలో ఎలాంటి చర్చ జరగలేదు. తదుపరి బడ్జెట్ సెషన్ జనవరి చివరి వారంలో ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -