Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్20న కలెక్టరేట్ లో మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమం

20న కలెక్టరేట్ లో మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమం

- Advertisement -
  • – కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి
    నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
  • వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన మూడు నెలల ప్రత్యేక కార్యక్రమం ‘ మీ డబ్బు – మీ హక్కు’ లో భాగంగా ఈ నెల (డిసెంబర్) 20న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
  • కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు – మీ హక్కు అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి 2025 అక్టోబర్ 4న గుజరాత్ లోని గాంధీనగర్ లో జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇది 2025 అక్టోబర్ 01 నుండి 2025 డిసెంబర్ 31 వరకు మూడు నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని చేపట్టారన్నారు.
  • కలెక్టరేట్ కార్యాలయంలో శిబిరం జరుగుతుందని, క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థ, శిభిరంలోని దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్.బి.ఐ ఉద్గమ్ వెబ్ సైట్ (http://udgam.rbi.org.in) ద్వారా పొందవచ్చని తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -