నవతెలంగాణ-హైదరాబాద్: ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పుతో పాటు స్కీమ్‌గా మార్చి దేశ వ్యతిరేక, గ్రామీణ ఉపాధికి వ్యతిరేకంగా బిల్ రూపొందించారని జర్మనీ పర్యటనలో ఉన్న ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈరోజుతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్షాలు పార్లమెంట్ ఆవణలో ఫ్లకార్డులు చేతబూని నిరసన తెలియజేశారు. శాంతి నిరసన ప్రదర్శనకు జర్మనీ పర్యటనలో ఉన్న ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు.
మోడీ సర్కార్ గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి కల్పించడంతో పాటు వలసలను నివారించడంలో కీలక పాత్ర షోషించిన MGNREGA పథకాన్ని నిర్వీర్యం చేసిందని, 20 ఏండ్లుగా ఉనికిలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. ఇది రాష్ట్ర వ్యతిరేక, ప్రణాళిక ప్రకారం గ్రామ వ్యతిరేకమైనది. MGNREGA గ్రామీణ కార్మికులకు బేరసారాలు చేసే శక్తిని ఇచ్చింది. పెత్తందార్ల దోపిడీని, వలసలను తగ్గించిందని తెలియజేశారు. అదే విధంగా గౌరవ వేతనాలు పెరిగాయి, పని పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. అదే సమయంలో గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించి పునరుద్ధరింయని రాసుకొచ్చారు.



