Friday, December 19, 2025
E-PAPER
HomeజాతీయంMGNREGA గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నుముక: ప్రియాంకా గాంధీ

MGNREGA గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నుముక: ప్రియాంకా గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కేంద్రం తెచ్చిన‌ VB-G RAM G బిల్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, MGNREGA ఉపాధి హామీ చ‌ట్టం గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నుముక అని కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. ఉపాధి హామీ చ‌ట్టం పేద ప్ర‌జ‌ల‌కు ఆర్థిక భ‌రోసాను క‌ల్పించిందని, ఉపాధి ప‌రంగా వెత‌ల‌ను తొల‌గించింద‌ని తెలిపారు. మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన‌ వీబీ జీ రామ్ బీ బిల్లుతో కేంద్రం నుంచి నిధులు మంజూరు కావ‌ని, దీంతో రాష్ట్రాల‌పై ఆర్థికంగా పెను భారం పడునుంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ హాయాంలో తెచ్చిన MGNREGAతో కేంద్రం నుంచి 90శాతం నిధులు మంజూరు చేశామ‌ని ఆమె తెలియ‌జేశారు. శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చ‌ట్టానికి మార్పులు చేస్తూ విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ రోజ్‌గ‌ర్ అజీవికా మిష‌న్ అని నామ‌క‌ర‌ణం చేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్టి చ‌ట్టాన్ని కాస్తా స్కీమ్ మార్చింది బీజేపీ ప్ర‌భుత్వం. విప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకించిన మోడీ ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రించి ఉపాధి హామీ చ‌ట్టాన్ని మార్పులు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -