Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిసాన్ మేళా, రైతు - శాస్త్రవేత్త చర్చగోష్టికి ఆహ్వానం

కిసాన్ మేళా, రైతు – శాస్త్రవేత్త చర్చగోష్టికి ఆహ్వానం

- Advertisement -

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా  ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

కిసాన్ మేళా, రైతు శాస్త్రవేత్త చర్చ గోష్టి కార్యక్రమాన్ని జనగాం జిల్లాలోని రఘునాథపురం మండలం నిడిగొండ గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీలత తెలిపారు. శుక్రవారం ఆమె నవతెలంగాణ తో మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం,యాదాద్రి భువనగిరి జిల్లా వారి ఆధ్వర్యంలో  కేంద్రీయ ప్రత్తి పరిశోధన సంస్థ ప్రాజెక్టులో భాగంగా జనగాం జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ గ్రామంలో, డిసెంబర్ 23,2025 న  ఉదయం 10 గంటల నుండి అధిక సాంద్రత ప్రత్తి సాగు విధానంపై కిసాన్ మేళ, రైతు- శాస్త్రవేత్త చర్చగోష్టి కార్యక్రమంను ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగాం జిల్లా కలెక్టర్ హాజరుకానున్నట్లు తెలిపారు. 

విత్తన, పెస్టిసైడ్స్ , యాంత్రికరణ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ సంబంద ఉత్పత్తుల పైన వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రైవేట్ కంపనీలు స్టాల్స్ ఏర్పాట్లు చేస్తారని అన్నారు.  వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, మత్స శాఖ అధికారులు, పిజెటిఏయు శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు. యాదాద్రి భువనగిరి,  జనగాం జిల్లా  రైతులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -