Friday, December 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రముఖ శిల్పి, పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ మృతిపై కేసీఆర్ సంతాపం

ప్రముఖ శిల్పి, పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ మృతిపై కేసీఆర్ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూపశిల్పి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్ వంజీ సుతార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామ్ సుతార్ శిల్ప కళా రంగంలో ఒక కోహినూర్ వజ్రం లాంటి వారని కేసీఆర్ కొనియాడారు. “ప్రపంచ ప్రఖ్యాత శిల్పి అయిన రామ్ సుతార్ సేవలను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వకారణం.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యంత సుందరంగా అంబేద్కర్ స్ఫురద్రూపాన్ని 125 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దిన ఆయన తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు” అని అన్నారు. ప్రముఖుల విగ్రహాలకు తన అద్భుతమైన ప్రతిభతో రూపం పోసిన రామ్ సుతార్ మరణం శిల్పకళా రంగానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. నిండు నూరేళ్ల జీవితాన్ని పరిపూర్ణంగా గడిపిన రామ్ సుతార్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -