నవతెలంగాణ-హైదరాబాద్: భారత్, దక్షణాఫ్రికా చివరి టీ20కి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో గుజరాత్ వేదికగా రెండు జట్ల మధ్య తుదిపోరు ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా..ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వనించింది. చివరి మ్యచ్‌లో విక్టరీ కొట్టి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా వ్యూహాలు రచించి, కసరత్తులు చేస్తోంది. అదే విధంగా సఫారీ టీం కూడా తుది పోరులో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది. అందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఐదు టీ20 మ్యాచ్‌లో భాగంగా ఇండియా 2-1 లీడ్‌లో ఉంది. నాల్గో టీ20 పొగమంచు కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే.
నేడు అహ్మదాబాద్ వేదికగా ప్రారంభంకానున్న మ్యాచ్‌లో సిరీస్ కోసం ఇరుజట్లు అమ్మీతుమ్మి తెల్చుకోనున్నాయి. సిరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా పట్టుదలతో ఉండగా, లాస్ట్ మ్యాచ్‌లో గెలిచి సమం చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది. అంతుకు ముందు జరిగిన టెస్ట్ సిరీస్ దక్షణాఫ్రిక కైవసం చేసుకోగా, వన్డే ఫార్మట్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. దీంతో రెండు జట్ల మధ్య జరిగిన ఫార్మాట్‌ల ప్రకారం ఇరు జట్లు తలా ఒక్క సిరీస్ ను కైవసం చేసుకున్నాయి. తాజాగా జరిగే చివరి టీ20లో టీమిండియా విక్టరీ సాధిస్తే..భారత్ అన్ని విధాలుగా ముందంజలో ఉండనుంది.
ఇప్పటి వరకు సఫారీతో జరిగిన మ్యాచ్‌ల పరంగా టీమిండియా అన్ని కేటగీరీల్లో బలంగా ఉంది. నేటీ చివరి మ్యాచ్లో పలు మార్పులు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లో సంజు శాంసన్ తుది జట్టులో నిలిస్తే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా రానున్నాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును గెలుపు బాటలో నడిపిస్తున్నా.. వ్యక్తిగత ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
భారత పర్యటనలో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సఫారీలు.. అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. రీజా హెండ్రిక్స్, ఎడెన్ మార్‌క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, డెవిడ్ మిల్లర్ వంటి మ్యాచ్ విన్నర్లు సఫారీ శిబిరంలో ఉన్నారు. కానీ సమిష్టగా రాణించటంలో బ్యాటింగ్ లైనప్ తడబాటుకు గురవుతోంది. లుంగి ఎంగిడి, నోకియా, బార్ట్‌మాన్‌లతో కలిసి జార్జ్ లిండె బౌలింగ్ బాధ్యతలు చూసుకోనున్నాడు.
తుది జట్లు (అంచనా):
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మార్‌క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డెవిడ్ మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కార్బిన్ బాచ్, జార్జ్ లిండా, ఎన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడి, బార్ట్‌మాన్.



