మండల వ్యవసాయాధికారి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు
భూ విస్తీర్ణం ఆధారంగానే రైతులు ఇంటి నుంచి యూరియా ప్రత్యేక యాప్లో బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీజ తెలిపారు. శుక్రవారం మండలంలోని కొయ్యూరు రైతువేదికలో వ్యవసాయ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫర్టిలైజర్ మొబైల్ ఆప్ గురించి వివరించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రైతులు జిల్లా స్థాయిలో ఎన్ని యూరియా సంచులు ఉన్నాయో రైతులు యాప్లో చూడవచ్చన్నారు. ముందస్తు బుకింగ్ సౌకర్యం అవసరమైన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసి, అనుకూలమైన డీలర్ను ఎంపిక చేసుకోవచ్చన్నారు.బుకింగ్ ఐడి ఆధారంగా కొనుగోలు బుకింగ్ పూర్తయిన తర్వాత బుకింగ్ ఐడి లభిస్తుందన్నారు.
ఆ ఐడి చూపించి యూరియా పొందవచ్చన్నారు. పంట, సాగు విస్తీర్ణ ఆధారిత కేటాయింపు, పంట రకం, సాగు చేసిన విస్తీర్ణం ఆధారంగా యూరియా పరిమాణం లెక్కించబడుతుందన్నారు. కౌలుదారు రైతులకు సౌకర్యం ఆధార్ ధృవీకరణతో పాటు భూమి యజమాని వివరాలు నమోదు చేసి కౌలుదారు రైతులు కూడా యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. ఏఈఓల సహాయం, హెల్ప్ లైన్, సందేహాల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులు సహాయం అందిస్తారని తెలిపారు. వ్యవసాయ అధికారులకు, ఫర్టిలైజర్ డీలర్లకు ఫర్టిలైజర్ అప్ గురించి వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఫర్టిలైజర్ డీలర్స్, రైతులు పాల్గొన్నారు.



