- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామాలలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కలుపు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు పంటల సాగులో కలుపు నివారణకు తీసుకోవలసిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలు, కలుపు యజమాన్య చర్యల గురించి రైతులకు వివరించారు. అదేవిధంగా రైతులకు డిఎస్ఆర్ పద్ధతి గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయిరాం, సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ మేనేజర్ ఉదయ్, అగ్రోనామిస్ట్ శివ సాయి కృష్ణ, జూనియర్ అగ్రోనమిస్ట్ భార్గవ్, సిఆర్ పిలు చింత శ్రీనివాస్, నోముల మహేందర్, శ్రీకాంత్, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



