నవతెలంగాణ-హైదరాబాద్: ఇంక్విలాబ్ మంచో సంస్థ కన్వీనర్ షరిప్ ఉస్మాన్ బిన్ హాదీ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు హాదీ భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో సింగపూర్ నుంచి తరలించారు. ఈక్రమంలో హాదీ అంతిమ యాత్రలో పాల్గొనడానికి భారీగా ఆయన అనుచరులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. దీంతో యూనిస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టదిట్టం చేసింది. అదే విధంగా రాజధాని ఢాకాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిస్ట భద్రతాను కల్పించారు. అంతమ యాత్రను శాంతియుతంగా నిర్వహించాలని యూనిస్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
డిసెంబర్ 12న రాజధానిలో బిజూనాయర్ సమీపంలో ఓ ప్రచారం ముగించుకొని ఆటో రిక్షాలో బయలుదేరుతుండగా..పలువురు దుండగలు వచ్చి హాదీపై కాల్పులు జరిపారు. తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 15న సింగపూర్‌కు తరలించినా హాదీ మృతి చెందారు. దీంతో ఆయన మృతితో ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో అలజడి చెలరేగింది. ఆందోళనకారులు పలు పత్రిక సంస్థలతో పాటు ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అదే విధంగా మైనార్టీ వర్గాలపై అల్లరి మూక దాడులు చేసింది.




