- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుళ్ల నియామకాల్లో నిబంధనలను సవరించింది. గతంలో 10 శాతంగా ఉన్న అగ్నివీరుల కోటాను 50 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి దశలో 50 శాతం ఖాళీలను మాజీ అగ్నివీరులకు కేటాయించగా, రెండో దశలో మిగిలిన ఖాళీలకు నియామకాలు జరుగుతాయి. అయితే, మొదటి దశలో కొంతమందికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నియామకాలు చేపడతామని తెలిపింది.
- Advertisement -



