నవతెలంగాణ-హైదరాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా పీఎం మోడీ కలకత్తా పర్యటనకు ఆటంకం ఏర్పడింది. నదియా జిల్లాలో ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పలు ఇబ్బందులు ఎదురైయ్యాయి. దీంతో ఏమి చేయలేక పీఎం హెలికాప్టర్ వెనుదిరి కలకత్తా ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వాతావరణ పరిస్థితులు బట్టి మోడీ పర్యటించనున్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన నదియా జిల్లాలోని నేషనల్ హైవే -34లోని బరజాగులి కృష్ణానగర్ సెక్షన్‌లో 66.7 కి.మీ పొడవున నిర్మించిన నాలుగులైన్ల రోడ్డు మార్గాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఉత్తర 24 పరగణాల జిల్లాలోని 17.6 కి.మీ పొడవైన బరసత్-బరజగులి సెక్షన్ నాలుగులైన్ల రోడ్డు మార్గాన్ని నిర్మించడానికి ఆయన శంకుస్థాన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నారు.
కాగా ఇటీవల ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 58 లక్షల మంది ఓటర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. ఇలా తొలగింపు తర్వాత తొలిసారి మోడీ బెంగాల్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల దృష్ట్యా బిజెపి బెంగాల్‌పై దృష్టిపెట్టింది.



