- Advertisement -
ఆందోళన చేపట్టిన భూ నిర్వాసితుల
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ఓసీపీకి 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను,భూములను సేకరించి పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలంటూ శనివారం భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టి,ఓసిపి పనులు అడ్డుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు వాల్వలను అడ్డుకున్నారు. గత ఎనిమిది ఏళ్లుగా ఓసిపితో వస్తున్న దుమ్ము, దూళితో తాము ఇబ్బందులకు గురితున్న జెన్కో అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిస్కారం అయ్యేలా చూస్తామని ఏఎమ్మార్ అధికారులు హామీ ఇవ్వడంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.
- Advertisement -



