Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్20న తాడిచెర్ల సర్పంచ్ గా బండి స్వామి ప్రమాణస్వీకారం

20న తాడిచెర్ల సర్పంచ్ గా బండి స్వామి ప్రమాణస్వీకారం

- Advertisement -

హాజరు కానున్న మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిచెర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన బండి స్వామి బారి మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయతే ఈనెల 22న సోమవారం ఉదయం 11 గంటలకు తాడిచెర్ల సర్పంచ్ గా, బండి స్వామి ప్రమాణ స్వీకారోత్సం నిర్వహించడం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ నాయకుడు బండి రణధీర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాడిచెర్ల కొత్త గ్రామపంచాయతీలో  నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు. కావున గ్రామంలోని అన్ని వర్గాల నాయకులు, ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు హాజరు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -