- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం బీసీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్‌లో యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ స్థానం సంపాదించాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి, కెప్టెన్‌గా జార్ఖండ్ కు ట్రోఫీ అందించడంతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు కిషన్. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కిషన్ కి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడంపై అతని తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘దేవుడు ఒక తల్లి ప్రార్థనలు విన్నాడు. దేవుడు ఇషాన్ కష్టాన్ని చూశాడు’ అని ఆమె తెలిపారు.
- Advertisement -



