- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : వాట్సాప్ యూజర్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ చేశారు. ‘హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్. ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. చివరికి మీ ఖాతాను మీరే వాడకుండా లాక్ చేస్తారు
- Advertisement -



