Wednesday, May 21, 2025
Homeజాతీయంబుల్లెట్ ట్రైన్ నిర్మాణ‌ప‌నుల‌పై కేంద్ర రైల్వే మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న

బుల్లెట్ ట్రైన్ నిర్మాణ‌ప‌నుల‌పై కేంద్ర రైల్వే మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప‌నుల‌పై కేంద్ర రైల్వే మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 300కిలో మీట‌ర్ల మేర ట్రాక్ నిర్మాణం పూర్తి అయిందని, ఈ ప్రాజెక్టు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేష‌న్ త్ర‌వ్వకాల ప‌ని ప్ర‌స్తుతానికి 76శాతం ప‌నులు పూర్తి అయిన‌ట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఆధ్వ‌ర్యంలోప‌నులు చురుగ‌కా సాగుతున్నాయని ఆయ‌న కొనియాడారు. ‘14.2 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఈ స్థలం నుండి 18.7 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని తవ్వాలి. 120 క్యూబిక్ మీటర్ల/గం సామర్థ్యం గల మూడు బ్యాచింగ్ ప్లాంట్లు సైట్‌లో పనిచేస్తున్నాయి. బ్యాచింగ్ ప్లాంట్లకు కాంక్రీట్ ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడే ఐస్ ప్లాంట్ చిల్లర్ ప్లాంట్ అందించబడ్డాయని’ ఆయ‌న ఎక్స్ లో రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -