Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ శాస్త్రాన్న ప్రసాద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

శ్రీ శాస్త్రాన్న ప్రసాద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్
కేరళ బార్డర్ లోని తమ్మనం పట్టి అయ్యప్ప దేవాలయంలో శ్రీ షష్ఠ అన్న ప్రసాద సేవా ట్రస్ట్ అధ్యక్షులు చంద్రశేఖర శర్మఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి జనవరి 15 వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పందలం రాజావారు రాజా రవి వర్మ ఈ నెల 15న అన్నదాన కార్యక్రమంప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు భోజనాలు ఏర్పాటు చేశామని అలాగే రాత్రి అల్పాహారం అయ్యప్ప లకు ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములు అందరూ కూడా దిండిగల్ నుండి కుమ్ల్లిపోయే దారిలో తమనం పట్టి లో ఉంటుందని ఇక్కడ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా అధ్యక్షులు చంద్రశేఖర శర్మ కోరారు.

ఈ ప్రారంభోత్సవానికి పందాలం రాజు రాజా రవి వర్మతో పాటు, నాచారం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామీజీ, మల్లారం స్వామీజీ బాలయోగి పిట్ల కృష్ణ స్వామీజీ పాల్గొన్నారు. భోజనాలని బఫే సిస్టంలో కాకుండా కూర్చొని భోజనం పెట్టడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని, కూడా అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా గొప్పదని అయ్యప్పలకి భోజనం పెట్టడం శ్రీ శాస్త్ర అన్నప్రసాద సేవ ట్రస్ట్ వాళ్ళని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి భాను దాస్ కులకర్ణి, లక్ష్మారెడ్డి, ప్రకాష్, మణిరాజ్ ,సంస్థసభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -