Wednesday, May 21, 2025
Homeఖమ్మంసామర్ధ్యాలు పెంపుతో నే వినూత్న రీతిలో బోధన…

సామర్ధ్యాలు పెంపుతో నే వినూత్న రీతిలో బోధన…

- Advertisement -

– పఠనాసక్తి పెంపొందించేలా అభ్యసనం: ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

విద్యార్ధులతో పఠనాసక్తి పెంపొందించేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయులకు బోధనా సామర్ధ్యాలు మెరుగుపరిచే శిక్షణా కార్యక్రమాలు చేపడుతుందని ఎంఈఓ పి.ప్రసాదరావు అన్నారు. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు బోధన సామర్ధ్యాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం ప్రాధమిక స్థాయి ఉపాద్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నిత్య విద్యార్ధిగా ఉన్న ఉపాధ్యాయుడే విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతారు అని,అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అని అన్నారు.  మొత్తం 124 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరు కానున్నారు అని తెలిపారు. ఈ శిక్షణలో విద్యార్ధుల్లో అంతర్గత మేధ ను వెలికి తీయడం,ఆధునిక, సాంకేతిక,యాంత్రిక జీవనంలో విద్యార్ధుల్లో వచ్చిన మార్పును,జీవనశైలి ని అవగాహన చేసుకోవడం, వీటికి తగ్గట్టు పాఠ్యాంశాలను ఆశక్తికర రీతిలో బోధించడం అనే అంశాలు పై రిసోర్స్ పర్సన్స్ ఉపాద్యాయులకు అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి కోర్స్ కో ఆర్డినేటర్ గా ఎం.ఈ.ఓ ప్రసాదరావు,రిసోర్స్ పర్సన్స్ గా బి.శ్రీశైలం, సున్నం నాగేశ్వరరావు, పి.రాము, ఎం.పర బ్రహ్మచారి, కొర్రి వెంకటేష్, వీ.సీతారాములు, ఎస్.భాస్కర్, ఏ.శ్రీనివాసరావు, క్లర్క్ ఎస్.కే మహా బూబ్, ఆపీస్ సబార్డినేట్ లు టి.సుజాత, ఎస్.కే ఖాదర్ బీ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -