- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్-ఇందారం ఎక్స్ రోడ్డు మధ్య సోమవారం తెల్లవారుజామున బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. వీరంతా మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. కరీంనగర్లో వరినాట్లు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -



