– నీళ్లు నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దాం
– కెసిఆర్ అసెంబ్లీకి రావాలి
నవతెలంగాణ-అలేరు : ప్రతిపక్ష నేత కేసిఆర్ అసెంబ్లీకి వచ్చి నీళ్లు నిజాలపై చర్చిస్తే తెలంగాణ ద్రోహి ఎవరో తేటతెల్లమవుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హేద్దేవ చేశారు.సోమవారం నాడు నవ తెలంగాణతో ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో లక్ష కోట్లు పెట్టి కాలేశ్వరం ని కట్టే పేరుతో ఏ టీ ఎం గా కల్వకుంట్ల కుటుంబం మార్చుకున్నారని ఆరోపించారు.
అప్పటి మంత్రి హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి ఎప్పుడు వస్తారో చెప్పలేరు కానీ దక్షిణ తెలంగాణ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై అప్పుడే దృష్టి పెడితే అయిదు నుండి పదివేల కోట్లతోనే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉన్న పట్టించుకోలేదన్నారు. అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయం లో 2021 నుండి 2022,2023 సంవత్సరాల్లో యూరియా కొరత తో గడిచిన సంవత్సరాల్లో యూరియా షాపుల ముందు ప్రజలు బారులు తీరిన పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ని చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే యూరియా కొరత వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను పక్కదారి పట్టించడానికి అన్నారు.నోరు ఉంది కదా అని గట్టిగా ఏది పడితే అది మాట్లాడితే అబద్ధం నిజం కాదు ఆధారాలతో అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పి తెలంగాణ ప్రజల ముందు కెసిఆర్ హరీష్ రావు మీరు నిజాయితీ నిరూపించుకోవాలన్నారు



