Monday, December 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో ఆందోళనలు..మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు

బంగ్లాదేశ్‌లో ఆందోళనలు..మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత వ్యతిరేకి, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ మరో విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్‌ నేషనల్‌ సిటిజన్‌ పార్టీ సీనియర్‌ నేత మోతాలెబ్‌ సికదార్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

సోమవారం ఉదయం ఖులానా పట్టణంలోని సికదార్‌ నివాసం వద్దే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సికదార్‌ తల్లోకి తూటా దూసుకెళ్లడంతో ఎడమవైపు తీవ్ర గాయమైంది. అతడి మద్దతుదారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు నేషనల్‌ సిటిజన్‌ పార్టీ సిద్ధమవుతోన్న వేళ.. ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -