Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని వివిధ గ్రామాలలో నూతన పాలకవర్గాన్ని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు ప్రమాణస్వీకారం సోమవారం చేయించారు. ఈ సందర్భంగా నైనాల గ్రామ సర్పంచ్ యాసం సంధ్య రమేష్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేకాధిక అధికారి పద్మ చేయించారు. పార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ గా ఎదెళ్ల పూలమ్మను మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. వస్త్రం తండా సర్పంచ్ గా అరుణ మధు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి రవి ప్రమాణ స్వీకారం చేయించారు.

నెల్లికుదురు పులి వెంకన్న ను మరియు సర్పంచ్ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి పద్మ ప్రమాణ స్వీకారం చేయించారు. రాతిరం తండా గ్రామ సర్పంచ్ గ సుజాతను ఉప సర్పంచ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. రామన్నగూడెం గ్రామ సర్పంచ్ గా బండి శ్రీను ను మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి ఎం రవి ప్రమాణస్వీకారం చేయించారు. దుర్గ భవాని తండా సర్పంచ్ గా భూక్య వీరన్న ను మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి శ్రీను ప్రమాణ స్వీకారం చేయించారు.

బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గా చిర్ర యాకాంతం గౌడు తో పటు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి సిహెచ్ నరేష్ ప్రమాణస్వీకారం చేయించారు నల్లగుట్ట తండా సర్పంచిగా హేమలత శ్రీనును ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను హనుమాన్ నగర్ తండా గ్రామంలో అగ్రమ్మ సర్పంచిగా అశోకుని కాచికల్ గ్రామ సర్పంచ్ గా ఇట్టే లీలా దేవేందర్ ను ఆ గ్రామ ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించినట్లు తెలిపారు. సౌల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా గుగులోతు సుజాత వాసు మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆ గ్రామ ప్రత్యేక అధికారి బాలాజీ ప్రమాణ శ్రీకారం చేయించారు వీరి తోపాటు వివిధ గ్రామాలలో నూతన పాలకవర్గాన్ని సర్పంచ్ ల తో పాటు వార్డు సభ్యులను ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామంలో మమ్ములను సర్పంచిగా వార్డు సభ్యులుగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు అని మీకు రుణపడి ఉంటామని అన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కార మార్గంగా నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -