Monday, December 22, 2025
E-PAPER
Homeజిల్లాలుఉమ్మడి జిల్లాలో ఆదర్శ గ్రామంగా టంగుటూరు

ఉమ్మడి జిల్లాలో ఆదర్శ గ్రామంగా టంగుటూరు

- Advertisement -

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా 
సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్

నవతెలంగాణ – ఆలేరు రూరల్
టంగుటూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని నూతన సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం నూతన సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.

గ్రామ అభివృద్ధిలో రాజకీయాలకు తావులేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేస్తానని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అలాగే గ్రామంలో విద్య, వైద్యం,ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.నాకు మద్దతు ఇచ్చిన జర్నలిస్టులకు సిపిఐ ఎం పార్టీ కి కృతజ్ఞతలు అన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో గ్రామానికి నిధుల కోసం రాజకీయాలను పక్కకు పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని,గ్రామ పంచాయతీని ప్రజలకు దగ్గర చేసే విధంగా పనిచేస్తానని అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రతి వారం ప్రజా వినతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

పెద్ద సంఖ్యలో గ్రామంలో ప్రజల హాజరవడంతో పాటు హైదరాబాదు నుండి కూడా ఓట్లు వేసిన వారందరూ హాజరు కావడం విశేషం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,వార్డు నెంబర్ లు సభ్యులు, పార్టీ నాయకులు,యువకులు, మహిళలు పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టంగుటూరు గ్రామం అభివృద్ధి బాటలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించిన టంగుటూరు ప్రజల రుణం తీర్చుకోవడాని సర్పంచ్ పదవిని ఆషా మాషీగా తీసుకోకుండా ప్రజా సంక్షేమ కోసం పాటుపడతానని  చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -