Monday, December 22, 2025
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు 

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు 

- Advertisement -

– సీపీఐ(ఎం) మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు 
నవతెలంగాణ – బోనకల్  : కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని ప్రజాప్రతినిధులను సీపీఐ(ఎం) మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలో గల పెద్ద బీరవల్లి, గోవిందాపురం ఎల్ గ్రామాలలో సీపీఐ(ఎం) సర్పంచులు ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఊరూరు డాక్యుమెంట్స్ దేవాలయాల దగ్గర ఉంచారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏమీ అమలు చేయడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచేందుకు అధికార పార్టీ నాయకులు అనేక అక్రమ మార్గాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం లో ముదిగొండ బోనకల్ మండల కేంద్రాలలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందన్నారు. బోనకల్ లో సీపీఐ(ఎం) బలపరిచిన టిఆర్ఎస్ అభ్యర్థి జ్యోతి 962 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించింది అన్నారు. ముదిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పై సీపీఐ(ఎం) అభ్యర్థి కట్టకూరి ఉపేందర్ 932 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాడన్నారు. కానీ మిగిలిన చిన్న చిన్న గ్రామాలలో కాంగ్రెస్ డబ్బులు వెదజల్లి గెలిచిందన్నారు. అనేక గ్రామాలలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కు వచ్చిన స్థానాలు ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన స్థానాలు దాదాపు సమానంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాల నిలిపివేస్తామని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసి గెలిచారన్నారు. అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందన్నారు. సీపీఐ(ఎం) గెలిచినా ఓడిన ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.

మధిర నియోజకవర్గంలో సత్తా చాటిన సీపీఐ(ఎం) : సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు 
మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) తన చెత్తా చాటుకుందని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు అన్నారు. మధిర నియోజకవర్గానికి గుండెకాయ లాగా ఉన్న బోనకల్ ముదిగొండ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారన్నారు. కాంగ్రెస్ నాయకులు అనేక ప్రలోభాలకు గురిచేసిన కొన్నిచోట్ల ఓటర్లు విజ్ఞత ప్రదర్శించి ఓట్లు వేసి సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. సర్పంచ్ లుగా గెలిచిన సీపీఐ(ఎం) నాయకులు ప్రజా సమస్యలే పరిష్కారం ఏ జెండాగా పరిపాలన చేయాలన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికి నీతి నిజాయితీగా వినియోగిస్తారు అన్నారు. నిధులు దుర్వినియోగం కావన్నారు. ఆ విధంగా సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎనమద్ది సత్యనారాయణ గోవిందాపురం ఎల్ పెద్ద బీరవల్లి సర్పంచులు చింతల చెరువు కోటేశ్వరరావు మంద కరుణ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు మండల కార్యదర్శి కిలారు సురేష్ పెద్ద బీరవల్లి మాజీ సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ మాజీ ఎంపీటీసీ కర్లకుంట ముత్తయ్య ఉపసర్పంచ్ పెద్ద పోలు రామారావు లక్ష్మీపురం మాజీ సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, సీపీఐ(ఎం) నాయకులు ఏడునూతల లక్ష్మణరావు, కాట కోటయ్య, కళ్యాణపు బుచ్చయ్య, వల్లంకొండ సురేష్, తమ్మారపు లక్ష్మణరావు, కళ్యాణపు శ్రీనివాసరావు, నల్లమోతు నాగేశ్వరరావు, పొన్నం రాంబాబు, నల్లమోతు వాణి, పసుపులేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -