Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రమదానం చేసిన నూతన పాలకవర్గం 

శ్రమదానం చేసిన నూతన పాలకవర్గం 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ : పదవి బాధ్యతలు చేపట్టగానే అందరికంటే భిన్నంగా నూతన పాలకవర్గం శ్రమదానం చేసి ఔర అనిపించుకున్నారు. మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో సోమవారం సర్పంచ్ వార్డ్ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ సందర్భంగా దుబ్బ కాలనీలో స్వయంగా చెత్తను పరిశుభ్రం చేస్తూ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో నింపారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు గ్రామస్తులు పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రేణుక దేవి, గ్రామ సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామి నాథ్ , వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -