- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ : గణితంతో విద్యార్థుల మేధస్సు మరింత మెరుగుపడుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి కృష్ణవేణి అన్నారు. మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు, మ్యాథ్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



