Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ పాఠశాలలో చదివితే ఎదగడం గ్యారెంటీ

ఈ పాఠశాలలో చదివితే ఎదగడం గ్యారెంటీ

- Advertisement -

– బాల్కొండ నూతన సర్పంచ్ గాండ్ల రాజేష్ 
నవతెలంగాణ-బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరిసా హైస్కూల్లో చదివే విద్యార్థులు లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదగడం గ్యారంటీ అని బాల్కొండ నూతన సర్పంచ్ గాండ్ల రాజేష్ అన్నారు. సోమవారం మ్యాథమెటిక్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలో జరిగిన మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ను ఆయన ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, వార్డ్ మెంబర్లు తో కలిసి పరిశీలించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్ లు కే సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి లు గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను ఘనంగా శాలువాలతో సన్మానించి మెమోటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేష్ మాట్లాడుతూ తనతో పాటు ఉపసర్పంచ్, మెజార్టీ వార్డ్ మెంబర్లు ఈ పాఠశాలలో చదివిన వారేనని ఆయన గుర్తు చేశారు. గురువులతో సన్మానం తమకు లభించడం గొప్ప అదృష్టమని ఆయన అన్నారు. పాఠశాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారని ఈ పాఠశాల విద్యార్థులు చేరని రంగమంటూ లేదని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అమ్మలాంటిది ఈ పాఠశాలని ఆయన కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -