నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని కుప్టి గ్రామంలో సోమవారం నూతనంగా బాధ్యతలు తీసుకున్న సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు గ్రామాన్ని అన్ని రంగలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని స్థానిక సర్పంచ్ పొడుగంటి గంగారం అన్నారు. నూతన బాధ్యతలు తీసుకున్న అనంతరం మొట్టమొదటి సరిగా గ్రామమలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గా సభ్యులు పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో పాటు ప్రజ ప్రతి నిధులు మధ్యాహ్న భోజన్నన్ని విద్యార్థులతో కలసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి అందించేలా చూడలని ఉపాధ్యాయులకు సూచించారు. అదే విదంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన భోజనన్ని అందించాల్ని అన్నారు. దింతో పాటు గ్రామమలో ఉన్న ప్రజలకు ప్రతి రోజు అందుబాటులో ఉండి గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన నూతన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



