- Advertisement -
– సిపిఐ మండల నాయకులు
నవతెలంగాణ నెల్లికుదురు : మండలంలోని నైనాల పార్వతమ్మ గూడెo గ్రామాల లో నూతనo గా ఎన్నిక కాబడిన సర్పంచులకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా సన్మానాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ జిల్లా నాయకుడు వారి పెళ్లి వెంకన్న మండల నాయకుడు చిర్రా సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైనాల గ్రామ సర్పంచ్ యాసం సంధ్య ను పార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచిగా ఎన్నిక కాబడిన ఎదెల పూలమ్మను శాలువాతో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. గ్రామంలో గ్రామంలోని ప్రజల సమస్యలను గుర్తించి ప్రజల కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆదుకోవాలని తెలిపారు.
- Advertisement -



