నవతెలంగాణ-హైదరాబాద్: బిజెపి నేత రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌కి నోటీసులిచ్చింది. ఈ పిటిషన్‌పై శశిథరూర్ తన వైఖరి తెలియజేయాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న మెజిస్టీరియల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాజీవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై నోటీసు జారీ చేస్తూ జస్టిస్ రవీందర్ దుడేజా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబర్ 16కి వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పరాస్ దలాల్ శశిథరూర్‌కు సమన్లు జారీ చేసేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.