నవతెలంగాణ – జన్నారం
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పై అక్రమ కేసులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ, ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో లేదని బి ఆర్ఎస్ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరులతో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా ఎన్నికల హామీలు అమలు చేయడం లేదన్నారు. 17 నెలల క్రితం జరిగిన ఘటన లో జాన్సన్ నాయక్ పై ఇప్పుడు కేసు నమోదు చేయడం కక్ష్య సాధింపు చర్య అన్నారు.
అధికార పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధపు హామీలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా తులం బంగారం. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్, నిరుద్యోగులకు నెలకు రూ. 4,000 భృతి, ఇలా అనేక అబద్ధపు 420 హామీలు ఇచ్చి మర్చిపోయారన్నారు. ఒకవైపు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు కష్టం నీరుగారి పోతున్న నష్టపోయిన రైతుల కోసం ప్రభుత్వ పక్షాన కనీసం పంట నష్ట పరిహారంపై దృష్టి పెట్టకుండా అన్నం పెట్టే రైతన్నకు కనీసం భరోసా కల్పించడం మరచిపోతున్న అధికార నాయకులు అప్పుడెప్పుడో అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దేశ్యపూర్వకంగా గొడవ చేసిన సంఘటనను ఇప్పుడు 17నెలల గడిచిన తరువాత మా నాయకునిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలకై స్పందిస్తూన్న జాన్సన్ నాయక్ పై పెట్టిన అక్రమ కేసుపై ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలపై పెడితే బాగుంటుందన్నారు. ఇది కేవలం కక్ష్య సాధింపు చర్య అని ఇలాంటి కేసులు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన పెట్టుకున్న మా పార్టీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియలేరన్నారు. డిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినా గులాబీ శ్రేణుల ఉద్యమ స్ఫూర్తిని అధికార పార్టీ నాయకులు మర్చిపోవద్దని హెచ్చరించారు.
మా నాయకుడు కేసీఆర్ కేటీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలకే ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు అధికార పార్టీపై ఉద్యమిస్తూనే ఉంటామన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా పాలనా పేరిట పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు నమోదు చేస్తూ కక్షపూరిత రాజకీయాలు చేస్తూన్న వారు ఎంతటి వారైనా తగిన బుద్ధి చెప్తామన్నారు.ఇప్పటికైనా అక్రమ కేసులపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలపై పెట్టి ప్రజల మన్ననలు పొందాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుతార్ వినయ్ కుమార్ మండల మాజీ అధ్యక్షులు భరత్ కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జాడి గంగాధర్, మాజీ కో ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, నాయకులు ఫజల్ ఖాన్, కే ఏ నరసింహులు బోర్లకుంట ప్రభుదాస్, నేతకాని మహార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయనీ ప్రసాద్ నేత, కొండకూరి ప్రభుదాస్ భరత్ నాయ క్, రెడ్డి భూతం శ్రీనివాస్, కందుకూరి స్వామి రవి ముదిరాజ్, సాయిి,మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు సర్పంచులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.