Wednesday, May 21, 2025
Homeజాతీయంఉత్తరాఖండ్‌లో విరిగిప‌డిన కొండ చ‌రియలు

ఉత్తరాఖండ్‌లో విరిగిప‌డిన కొండ చ‌రియలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్తరాఖండ్‌ లోని పిథోర్‌గఢ్‌ జిల్లాలో మంగళవారం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన కైలాస్ మానస సరోవరం యాత్ర ప్రధాన మార్గంలో చోటుచేసుకోవటంతో వందలాది మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే పర్వత ప్రాంతం కావడంతో సహాయం అందించడంలో సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి రోడ్డు పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడటంతో మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో కైలాస్ యాత్రను తాత్కలికంగా నిలిపివేశారు. కాగా, ఈ ప్రాంతంలో తరచూగా కొండచరియలు విరిగిపడుతుంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -