Tuesday, December 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌లో ఎన్నికల యంత్రాంగంతోనే సమస్య : రాహుల్

భారత్‌లో ఎన్నికల యంత్రాంగంతోనే సమస్య : రాహుల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెర్లిన్‌లో హెర్టీ స్కూల్‌లో విద్యార్థులనుద్దేశించి ‘పాలిటిక్స్‌ ఈజ్‌ ద ఆర్ట్‌ ఆఫ్‌ లిజనింగ్‌’ అనే అంశంపై మాట్లాడారు. ఆయన ప్రసంగంలో భారత ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేరుస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఉదాహరణకు 2024 హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు న్యాయంగా జరగలేదని మేము ఎన్నికల సంఘాన్ని అడిగినా.. స్పందించలేదని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో మేము గెలిచాము. మేము భారత్‌లో ఎన్నికల నిష్పాక్షికతకు సంబంధించిన సమస్యల్ని మేము లేవనెత్తుతున్నాము. మేము అధికారంలో ఉన్న హర్యానాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాం. మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం న్యాయం జరగలేదని నేను ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి స్పష్టంగా వివరంచాను. హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్‌ మహిళ 22సార్లు ఎలా ఓటు వేశారని మేము ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాము. దీనిపై ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు. భారతదేశంలో ఎన్నికల యంత్రాంగంతోనే సమస్య ఉందని తాము విశ్వసిస్తున్నట్లు రాహుల్‌ చెప్పారు.

భారత్‌లో దర్యాప్తు సంస్థల్ని కేంద్రం ఆయుధంగా మారుస్తోందని రాహుల్‌ ఆరోపించారు. క్విడ్‌ ప్రోకోలాగా భారత్‌లో వ్యాపారవేత్తలు బిజెపికి ఆర్థికంగా మద్దతు ఇస్తున్నాయి. దీంతో సంస్థాగత నిర్మాణమే నాశనమవుతుంది. బిజెపి వ్యక్తులపై ఇడి, సిబిఐ కేసులు లేవు. ప్రతిపక్షపార్టీ వ్యక్తులపైనే కేసులుంటాయి. ఓ వ్యాపారవేత్త కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే.. ఆ వ్యక్తికి బెదిరింపులు ఎదురవుతాయి. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి బిజెపి భారతదేశ సంస్థాగత చట్రాన్ని సాధనంగా ఉపయోగించుకుంటోంది. ఉదాహరణకు బిజెపి దగ్గర ఎంత డబ్బుంది, ప్రతిపక్షాల దగ్గర ఎంత డబ్బు ఉందో చూడండి అని రాహుల్‌ అన్నారు. దర్యాప్తు సంస్థల్ని ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రతిఘటన వ్యవస్థను సృష్టిస్తుంది అని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోంది. దీనిని ఎదుర్కోవడానికి మేము మార్గాలను కనుగొనాలి. విజయం సాధించే ప్రతిపక్ష ప్రతిఘటన వ్యవస్థను మేము సృష్టిస్తాము. మేము బిజెపితో పోరాడటం లేదు. వారు చేస్తున్న భారత సంస్థాగత నిర్మాణాన్ని ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము అని రాహుల్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -