- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల వార్తలపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘‘రాష్ట్రంలో సిట్‌లు ప్రహసనంగా మారాయి. నాకు నోటీసు ఇస్తారట. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు.
- Advertisement -



