- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.12,500 కోట్లు విద్యుత్ శాఖకు ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా దిగజారి మాట్లాడలేమని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రెండేళ్లుగా అసెంబ్లీకి రాని కేసీఆర్, మీడియా సమావేశంలో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, శాసనసభకు రావడానికి భయపడుతున్నారని విమర్శించారు.
- Advertisement -



