Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రి

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రి

- Advertisement -

నీటి ఎద్దడి నివారణ కోసం బోరు స్థలం పరిశీలన
నవతెలంగాణ – మద్నూర్

ఈనెల 22న నూతన సర్పంచిగా ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించిన మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని యాదవ్ గల్లి లో నీటి ఎద్దడి ఉన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ గల్లి ప్రజలు పోటీ అభ్యర్థుల దృష్టికి తీసుకురాగా గల్లీ ప్రజల కోరికను తీర్చేందుకు నూతన సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. బోరు వేయించి పైప్ లైన్ ద్వారా ఆ గల్లి ప్రజలకు నీటిని అందించేందుకు సర్పంచ్ రతం గల్లి ప్రాంతంలో బోరు వేయడానికి స్థలం పరిశీలించారు. ఇక్కడ బోరు వేసి అక్కడికి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే ఆలోచనలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గెలిచి ప్రమాణ స్వీకారం చేసి రెండవ రోజే గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి సర్పంచ్ అభివృద్ధి పనులు చేపట్టడానికి తీసుకుంటున్న చర్యలు పట్ల నీటి ఎద్దడి గల్లి ప్రజలు సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోరు వేయడానికి స్థల పరిశీలన కార్యక్రమంలో సర్పంచ్ వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల తో పాటు తొమ్మిదో వార్డు నుండి ఉషా సంతోష్ మేస్త్రి ప్యానల్ నుండి పోటీ చేసి ఓడిపోయిన సందర్వార్ అశోక్ పాల్గొనడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -