Tuesday, December 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపు మేడారంలో దర్శనాలు బంద్..

రేపు మేడారంలో దర్శనాలు బంద్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన జారీ అయింది. బుధవారం గద్దెల ప్రాంగణంలో గోవిందా రాజు, పగిడిద్ద రాజుల ప్రతిష్టాపనతో పాటు విస్తరణ పనులు ఉన్నందున భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘ అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తమ దర్శనాలను ఒక రోజు వాయిదా వేసుకోవాలని కోరారు. మహా జాతరకు సమయం సమీపిస్తుండటంతో మేడారం అభివృద్ధి పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -