ఉన్నత విద్య నియంత్రణ కోసం వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ -2025 పేరుతో నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెస్తోంది. దేశంలోని వైద్య, న్యాయ విద్య మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒక గొడుగు సంస్థలా పనిచేస్తుంది. ఇందులో చైర్‌పర్సన్‌తో పాటు పన్నెండు మంది సభ్యులు ఉంటారు. ఈ చట్టం ద్వారా ఏర్పడే వికసిత భారత్ శిక్షా వినియమన్ పరిషద్ (నియంత్రణ) బీ వికసిత భారత్శిక్షా గుణవత్తా పరిషద్ (అక్రిడిటేషన్)బీ వికసిత భారత్ శిక్షా మానక్ పరిషద్ (ప్రమాణాలు) మొదలైన పదజాలం ఉన్నత విద్యను కాషాయీకరించే రాజకీయ దృక్పథాన్ని తెలియ జేస్తాయి. 1952లో ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చట్టంతో పాటు ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), ఎన్సీటీఈ (జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి) వంటి సంస్థలు రద్దవుతాయి.విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు స్వతంత్ర స్వయం-పరిపాలనా సంస్థలుగా మారడానికి వీలు కల్పించడమే దీని ఉద్దేశ్యమని బిల్లు పీఠిక చెబుతుంది. కానీ విద్య ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. కొఠారి విద్యాకమిషన్ (1964-66) సిఫార్సు చేసిన విధంగా విద్యకు తగినంత నిధులు సమకూర్చడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ద్వారా ఉన్నత విద్యను మరింత అందుబాటులోనికి తెచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తోందని స్పష్టమవుతోంది.ప్రయివేటు విద్యా మార్కెట్ విస్తరణకు అవకాశాలు కల్పించడమే కాకుండా, విద్యా పెట్టుబడి దారులకు ఎటువంటి నిబంధనలు, ఆంక్షలు, చట్టాలు ఉండకుండా చూసే నేపథ్యంలో ఈ బిల్లును కేంద్రం తెస్తుంది. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల ఒత్తిడికి లొంగి ప్రభుత్వాలు నిబంధనలు, ఆంక్షలు పెట్టకుండా స్వతంత్ర నియంత్రణ సాధికార సంస్థకు అప్పగించే విధానంలో భాగంగా ఈ బిల్లు ముందుకు వస్తోంది. ప్రభుత్వ విద్యా సంస్థలను, ప్రయివేటు విద్యాసంస్థలను సమానంగా చూడాలని, దేశీయ విద్యా సంస్థలకు ఇచ్చే రాయితీలన్నింటినీ విదేశీ విద్యాసంస్థలకు ఇవ్వాలనే విద్యా వ్యాపారుల సూచనల మేరకు ఈ బిల్లు ముందుకు వస్తోంది.
బిల్లులోని సెక్షన్ 2(1) ప్రకారం, సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవస్థల కేంద్రీకరణకు అవకాశం ఇస్తుంది. పైగా విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాల స్వతంత్రతకు భంగం కలిగిస్తుంది. విశ్వవిద్యాల యాల స్వయం ప్రతిపత్తికి భంగకరంగా ఉంటుంది. అకాడమిక్ స్వతంత్రత ప్రమాదంలో పడుతుంది. ఏ సంస్థలు ఈ నిర్మాణంలోకి వస్తాయో అస్పష్టత ఉన్నందున అనేక సందేహాలు వ్యక్తమవుతు న్నాయి.సెక్షన్ 6(1) కమిషన్ కూర్పును నిర్దేశిస్తుంది. దీని ప్రకారం అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం లేదు పైగా విద్యావేత్తలకు ప్రాధాన్యత లేకపోవడంతో విద్యా రంగంపై బ్యురోక్రటిక్ అధికారా లకు అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్రాల స్వతంత్రతకు భంగం కలుగుతుంది. ఇందులో ప్రాతి నిధ్య స్వభావం లేదు. ఈ విషయంలో, ఉన్న ప్రధాన సమస్యలు ఏమిటంటే, మొదటిది: కమిషన్ ఏర్పాటులో కేంద్రీకరణ, బ్యూరోక్రసీకి అవకాశం ఉండటం. రెండవది: విద్యావేత్తలకు ప్రాతినిధ్యం లేకపోవడం. మూడవది: రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకపోవడం.
వికసిత్ భారత్ శిక్షా వినియమన్ పరిషత్ Regulatory Council): ఇది విశ్వవిద్యాలయాలు, కళాశాలల నియంత్రణ బాధ్యతలను చూస్తుంది. విద్యా సంస్థలు పాటించాల్సిన నిబంధనలను ఇది పర్యవేక్షిస్తుంది.వికసిత్ భారత్ శిక్షా గుణవత్తా పరిషత్ (Accreditation Council): ఇది విద్యా సంస్థలకు గుర్తింపు (Accreditation) ర్యాంకింగ్‌లను ఇచ్చే బాధ్యతను తీసుకుంటుంది. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తుంది.వికసిత్ భారత్ శిక్షా మానక్ పరిషత్ (Standards Council): ఇది విద్యా ప్రణాళికలు, సిలబస్, విద్యా ప్రమాణాలను (Academic Standards) నిర్ణయిస్తుంది. నిధుల అధికారాల బదిలీ (Separation of Funding): ఇంతకుముందు యూజీసీ విశ్వవిద్యాలయాలకు నిధులు మంజూరు చేసేది. కానీ కొత్త బిల్లు ప్రకారం, వీబీసీఏ కేవలం విద్యా ప్రమాణాలను మాత్రమే పర్య వేక్షిస్తుంది. నిధుల మంజూరు అధికారం నేరుగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోకి వెళ్తుంది. సింగి ల్ విండో సిస్టమ్: కళాశాలలు అనుమతుల కోసం వేర్వేరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అంతా ఒకేచోట జరుగుతుంది.విదేశీ విశ్వవిద్యా లయాలకు ద్వారాలు: విదేశీ యూనివర్సిటీలు భారత దేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవడానికి, భార తీయ యూనివర్సిటీలు విదేశాల్లో క్యాంపస్‌లు పెట్ట డానికి ఈ బిల్లు నిబంధనలను సులభతరం చేస్తుంది.
విద్య మొత్తం ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ 25 కింద ఉన్నత విద్య ఉన్న అంశం. అందువల్ల దేశం సాధారణ సమాఖ్య నిర్మాణానికి అనుగుణంగా, రాష్ట్రాల భాగస్వామ్యానికి తగిన నిబంధనలు రూపొందించాలి. కానీ విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగంలోని భారత ప్రభుత్వ కార్యదర్శి సభ్యునిగా చేర్చడం వలన సంస్థ రాజకీయమయం అవుతుంది. ఫలితంగా ఎంపిక చేయబడిన విద్యా వేత్తలను కేంద్ర ప్రతినిధుల ఇష్టానికి అనుగుణ ంగా పనిచేయమని బలవంతం చేసే ప్రమాదం ఉంది. అత్యున్నత హోదాలో ఉన్న కార్యదర్శి అభిప్రాయాన్ని వ్యతిరేకించడానికి విద్యావేత్తలు వెనుకాడవచ్చు, ఆ కార్యదర్శి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రభావానికి లోబడి ఉంటారు. కమిషన్ స్వతంత్రంగా పనిచేయడానికి, కమిషన్‌లోని వ్యక్తులు ప్రభుత్వ జోక్యం నుండి దూరంగా ఉండడంతో పాటు, స్వతంత్రంగా ఉండాలి.
ఇప్పటికే ఉన్న సంస్థలను పునర్నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు, ఉన్నత విద్యను పునర్ని ర్మించాల్సిన అవసరం ఉందంటూ ప్రత్యేకంగా వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ (వీబీసీఏ) రూపంలో ఎందుకు చేయాల్సి వస్తుందో స్పష్టత లేదు. వీబీసీఏ బిల్లు తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన గురించి చెబుతు న్నప్పటికీ, వాస్తవానికి, ఇది ఉన్నత విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం సర్వాధికార నియంత్రణకు లోబడి ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా, అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విద్యా నిపుణులకు శిక్షణ ఇవ్వడం, చక్కగా రూపొందించిన అభ్యాస సామగ్రిని అందించడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇది విద్యా ఫలితాలపై దృష్టి పెట్టడాన్ని నొక్కి చెబు తుంది. అటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉపాధి కల్పన ఫలితాలను ప్రభుత్వం ఎలా సాధించాలను కుంటుందో అస్పష్టంగా ఉంది. ఇంకా, ప్రస్తుత బిల్లు, తక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ, సామాజిక-ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు సేవలందించాల్సిన సంస్థలకు చేయాల్సిన ఖర్చుతో, లాభాపేక్షతో పనిచేసే ప్రయివేటు కార్పొరేట్ సంస్థలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది. నిధుల మంజూరు విధు లను విద్యామంత్రిత్వ శాఖకు అప్పగిం చడం ద్వారా ఇది మరింత తీవ్రమవుతుంది, ఆ మంత్రి త్వ శాఖ రాజకీయ కారణాలపై ఈ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. అందువల్ల, యూజీసీ వంటి ఇప్పటికే ఉన్న సంస్థలలోనే నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకుండా, వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ను ఒక ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు.
ప్రత్యేక వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ను ఏర్పాటు చేయడానికి బదులుగా, నాణ్యమైన విద్య కోసం విద్యా ప్రమాణాలను మూల్యాంకనం చేసే యంత్రాంగాలను అందించడానికి ఇప్పటికే ఉన్న సంస్థలలోనే సంస్కరణలు చేయాలి. ప్రత్యామ్నాయంగా, నిధులు, గుర్తింపు అందించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా కమిషన్లు, జాతీయ స్థాయి స్వయంప్రతిపత్తి గల సంస్థల ద్వారా భారత ఉన్నత విద్యా కమిషన్ అనే సంస్థకు మద్దతివ్వాలి. అంతేకాకుండా, స్వయంప్రతిపత్తి, పనితీరు ఆధారిత నిధుల భావనలను, ఉన్నత విద్యా సంస్థల్లో చేరే వివిధ వర్గాల విద్యార్థులను, అసమానతలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా అమలు చేయాలి.ప్రస్తుతం, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకతతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపారు. అయితే ఈ బిల్లును జేపీసీ క్షుణ్ణంగా సమీక్షించి, పరిశీలించి, రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలకు, రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి అనుగుణంగా ఉండేలా చూడాలి. ఉన్నత విద్యలో ప్రయివేటీకరణ, కార్పొరేటీ కరణను అరికట్టడానికి తగిన సిఫార్సులను చేయాలి. దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్య అందుబాటులో ఉండేలా, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలి.
కె. వేణుగోపాల్
9866514577



