– బెట్టింగ్‌యాప్ కేసులో సీఐడీ ప్రశ్నలు
– మంచు లక్ష్మీ, రీతూచౌదరీ, అస్సం భయ్యాలను విచారించిన అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బెట్టింగ్‌యాప్ కేసును విచారిస్తున్న రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం ముగ్గురు సినీనటులను ప్రశ్నించారు. లక్డీకాఫూల్‌లోని సీఐడీ కార్యాలయానికి ఉదయమే చేరుకున్న నటిమణులు మంచు లక్ష్మీ, రీతూ చౌదరీ, నటుడు అస్సం భయ్యాలను సాయంత్రం వరకు దర్యాప్తు అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు గానూ వీరికి రూ.లక్షల్లోనే భారీ ఎత్తున పారితోషకాలను సదరు యాప్ నిర్వాహకులు ముట్టజెప్పారనే ఆరోపణలున్నాయి. ఈ డబ్బులు వీరికి ఏ విధంగా ముట్టాయి, ఎవరి ద్వారా అందుకున్నారు, నగదు రూపంలోనా.. ఆన్‌లైన్‌లోనా, ఒకేసారి అందాయా… విడతలవారీగా అప్పజెప్పారా అనే కోణాల్లో అధికారులు వీరిని ప్రశ్నించినట్టు తెలిసింది. అంతేగాక ఈ డబ్బులను వీరు ఏం చేశారనే కోణంలో కూడా వివరాలను రాబట్టడానికి ప్రయత్నించారని సమాచారం. బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించాక కూడా ప్రమోషన్లు చేశారా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా ఈ ఐదేండ్లలో తమ బ్యాంకు అకౌంట్ల వివరాలను, ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే సమాచారాన్ని నటులు అందజేశారని సమాచారం. బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటి వరకు సీఐడీ అధికారులు.. ప్రముఖ నటులు ప్రకాశ్‌రాజ్, విజరు దేవరకొండ, దగ్గుబాటి రానా మొదలుకొని టీవీ యాంకర్‌లు తదితరులు కలిపి మొత్తం 25 మందిని ప్రశ్నించారు. మరోవైపు బెట్టింగ్ యాప్‌లో మనీలాండరింగ్ జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సైతం వీరిపై కేసులు నమోదు చేసి ప్రశ్నించారు. త్వరలోనే సీఐడీ అధికారులు ఈ కేసులో చార్జిషీట్‌ను దాఖలు చేయనున్నారు.
డబ్బులు ఏ విధంగా అందాయి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



