Wednesday, May 21, 2025
Homeజిల్లాలుకళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-మోపాల్ : నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ల‌బ్ధిదారుల‌కు ఎమ్మెల్యే భూపతిరెడ్డి పంపిణీ చేశారు. మోపాల్ మండలానికి సంబంధించిన 25 చెక్కులను మండల అధ్యక్షుడు ఎల్లోల్లా సాయి రెడ్డితో కలిసి ల‌బ్దిదార‌లకు అంద‌జేశారు. రూరల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలు కలిపి 208 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం ఆరంభమైందని, గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు కొనసాగుతూనే, సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేదకు అందుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి దాచుకోవడం దోచుకోవడం తెలియదని, పేద వాళ్లకు న్యాయం చేయడమే తమ కర్తవ్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఇది రైతన్నల రాజ్యం అని ఆయన కొనియాడారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేసామని భూభారతి ద్వారా గత ప్రభుత్వం చేసిన అవినీతి లెక్కలన్నీ బయటకు తీస్తామని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత పాద ప్రభుత్వాన్ని ఇంకా వారి బుద్ధి మారడం లేదని ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డాడు. ఈ కార్యక్రమంలో జలంధర్ రెడ్డి, నవీన్ గౌడ్, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -