- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకాశ్మీర్‌లోని సాంబ జిల్లాలోని సైనిక శిబిరంలో జరిగిన కాల్పుల్లో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెసిఒ) మరణించారని రక్షణ ప్రతినిధి బుధవారం తెలిపారు. మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని అన్నారు. జమ్మూలో విధుల్లో ఉన్న ఆర్మీ యూనిట్‌కు చెందిన ఒక జెసిఒపై కాల్పులు జరిగాయని అన్నారు. కాల్పులపై దర్యాప్తుకు ఆదేశించామని, ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చారు. వాస్తవాలు నిర్థారించిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
- Advertisement -



